
మలప్పురం: కేరళలో ఇటీవల విమానం కూలిన సమయంలో, బాధితులకు సహాయం అందించిన వాలంటీర్లకు ఓ పోలీసు అధికారి సెల్యూట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యపై విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ పోలీస్ ఏ. నిజార్, సాయం చేసిన యువతకు సెల్యూట్ చేశారు. ప్రమాదంలో మరణించిన ఓవ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరందరిని కొండట్టిలో క్వారంటైన్‌లో ఉంచారు. (కళ్లెదుటే ముక్కలైంది)
దీనిపై మలప్పురం పోలీస్ చీఫ్ అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎవరికి సెల్యూట్ చేయాలనే విషయంపై ప్రొటోకాల్ ఏమీ లేదని, అందువల్ల నిజార్ చేసిన చర్య చట్ట వ్యతిరేకమని చెప్పలేమన్నారు. అతనిపై ఏ చర్యలూ ఉండకపోవచ్చని అన్నారు. మలప్పురం జిల్లా కలెక్టర్ సైతం పోలీసు చర్యను క్షమించాలని అన్నారు. ప్రమాదం సమయంలో సాయమందించిన వారికి ఎయిర్ ఇండియా కూడా ధన్యవాదాలు తెలిపింది.