విండీస్ పై భారత్ గెలుపు
ధర్మశాల: వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 59 పరుగులతో విజయం సాధించింది. 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 48.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటయింది. మార్లోన్ శామ్యూల్స్(112) ఒంటరి పోరాటం చేసినా జట్టుకు ఓటమి తప్పలేదు.
టేలర్ 11, హోల్డర్ 11, రసెల్స్ 46, స్యామీ 15, బ్రేవో 40, పొలార్డ్ 6, రామ్ దిన్ 9, పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127) సెంచరీ సాధించాడు. రైనా(71), రహానే(68) అర్థ సెంచరీలు కొట్టారు. కోహ్లి 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కించుకున్నాడు.
ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో విండీస్, రెండో వన్డేలో భారత్ గెలిచాయి.
హుదూద్ తుపాను కారణంగా విశాఖపట్నంలో జరగాల్సిన మూడో వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. చివరి వన్డే కటక్ లో జరగాల్సివుంది.