పెన్సిల్వేనియా సభలో ట్రంప్
హత్యాయత్నం జరిగిన బట్లర్‌లో సభకు పోటెత్తిన అభిమానులు
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు.
రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.
చిందేసిన మస్క్
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment