Republican presidential candidate
-
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
Donald Trump: భారతీయురాలా? బ్లాకా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్‌న్యూస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు. -
US Elections: గన్ కల్చర్‌కు మానసిక రుగ్మతలే కారణం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు. అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు. ‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు. కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి.. కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత -
డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. సీఎన్ఎన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపగలను.. అందుకు రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా చైనా భాగస్వామ్యాన్ని వేరుచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యపడాలంటే మనం మొదటిగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముంది. లేదంటే 1972లో నిక్సన్ చైనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. నా దృష్టికి పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తుంతయారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి రష్యాను చైనా బిగి కౌగిలి నుండి విడిపిస్తానని అన్నారు. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రధానమైనదని వెల్లడించారు. I will end the Ukraine War on terms that require Putin to exit his military alliance with China. The goal shouldn’t be for Russia to “lose.” It should be for the U.S. to *win.* https://t.co/pmsxaiFR2I — Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 18, 2023 ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం..
వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న వివేక్ రామస్వామి హిందువు అని ఆయనకు ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడు కున్నేమాన్ ప్రసంగం చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయనకు మద్దతుగా నిలిచారు. నెబ్రాస్కాలోని నాన్-డినామినేషనల్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్ లో పనిచేస్తున్న హాంక్ కున్నేమాన్ ఇటీవల చేసిన ప్రసంగంలో.. రామస్వామి ఒక హిందువు అని ఆయనకు అండగా నిలిచినవారు దేవుని ఆగ్రహానికి గురవుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ మతప్రచారకుడు కున్నేమాన్ మతోన్మాద వ్యాఖ్యలు విచారకరమని కాంగ్రెస్‌కు చెందిన రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా తీవ్రంగా ఖండించారు. వీరిద్దరూ కూడా రాజకీయంగా వివేక్ రామస్వామితో ఏకీభవించకపోయినా ఆయనపై కున్నేమాన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. రాజా కృష్ణమూర్తి రాస్తూ.. నేను వివేక్ కృష్ణమూర్తితో రాజకీయంగా ఏకీభవించను కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి అమెరికాలోని అన్ని రాజకీయ పార్టీలు హిందువులతో సహా ఏ మతానికి చెందిన వారినైనా స్వాగతించాలి. రామస్వామిపై చేసిన మతోన్మాద వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రిపబ్లికన్ ప్రతినిధులంతా ఈ సామరస్యాన్ని ఆచరిస్తారని అనుకుంటున్నాను. I don’t agree with @VivekGRamaswamy on much, but one thing is certain: all political parties in America should welcome individuals of all faiths, including Hindus. I condemn the bigoted remarks directed toward Ramaswamy, and I hope that Republican electeds and others do the same. https://t.co/OI9CsOhBlU — Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) July 25, 2023 ఆర్ ఓ ఖన్నా స్పందిస్తూ.. వివేక్ రామస్వామికి నాకూ ఆత్మీయ విభేదాలున్న మాట వాస్తవం. కానీ ఆయన మతవిశ్వాసంపై చేసిన దాడి అసహ్యకరమైనది. అనేక మతాలకు చెందిన వారమైనా మనమంతా ఒక్కటే. అమెరికా రిపబ్లిక్షన్లు చాలా మంది రామస్వామి ఆదర్శాలకు అండగా నిలుస్తున్నారని.. అది వాస్తవమని రాశారు. I have had spirited disagreements with @VivekGRamaswamy. But this is a disgusting and anti-American attack on his faith. We are a nation of many faiths, & the fact that so many Christian American Republicans are willing to support Vivek speaks to that ideal. https://t.co/ebfrvpuIwU — Ro Khanna (@RoKhanna) July 25, 2023 వివాదాస్పదమైన కున్నేమాన్ వీడియో ప్రసంగం.. అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి.. మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైన రామస్వామికి మీరు అండగా ఉంటే మీరు దేవుడి ఆగ్రహానికి గురవుతారు. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా దేవుడి ఆగ్రహానికి గురై 2020లో పదవిని కోల్పోయారని ఇప్పుడు రామస్వామి విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి రామస్వామి మాత్రం తన ప్రచార కార్యక్రమాలలో నేను వారి సంప్రదాయానికి చెందకపోయినా వారి విలువలను మాత్రం చాల గౌరవిస్తానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి -
ట్రంప్ గెలిస్తే.. అమెరికా నాశనమవుతుందట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేస్తానని, వారిపై పోరాటానికి అదనంగా మరో 30 వేల యూఎస్ ట్రూప్‌లను పంపుతానని, బాంబులు వేయిస్తానని ప్రచారంలో విరుచుకుపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఊహించని మద్దతు వచ్చింది. ట్రంప్ నాశనం చేస్తానని చెబుతున్న ఐఎస్ ఉగ్రవాదులే అమెరికా ఎన్నికల్లో ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గాక ట్రంప్ విజయం సాధించాలని ఎదురు చూస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే ఆయన వల్ల అమెరికా నాశనం అవుతుందని జిహాదీలు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఐఎస్‌కు చెందిన మీడియాలో జిహాదీల ఇంటర్వ్యూలు వచ్చాయి. ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెడితే ఆయన నాయకత్వంలో అమెరికాను స్వీయవినాశనం దిశగా నడిపిస్తారని ఐఎస్ జిహాదీలు విశ్వసిస్తున్నారు. ట్రంప్ నిలకడలేని మనిషని, చంచలస్వభావంతో ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలు అమెరికాను బలహీనం చేస్తాయని నమ్ముతున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తాడని, దీనివల్ల ముస్లిం సమాజం ఏకమవుతుందని, ఇది ఐఎస్‌కు ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్టు మీడియా కథనం. అప్పుడు ఇస్లామిక్ టీమ్, యాంటీ ఇస్లామిక్ టీమ్ మధ్య యుద్ధం జరుగుతుందని జిహాదీలు చెబుతున్నారు. హిల్లరీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, ట్రంప్ తమ శత్రువని ఐఎస్ మద్దతుదారులు పేర్కొన్నారు. ట్రంప్‌ను గెలిపించాల్సిందిగా దేవుణ్ని కోరుకుంటున్నట్టు ఓ మద్దతుదారుడు చెప్పాడు. -
ముస్లింలను అమెరికా రానివ్వొద్దు
న్యూయార్క్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగనున్న ట్రంప్ దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. 'ఉగ్రవాద సమస్య ప్రమాదాన్ని, ముప్పును గుర్తించనంత వరకూ భయంకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇకముందు వారి తీవ్రవాద దాడులకు మన దేశంలోని పౌరులు బలి కాకూడదు... వారు జిహాదీని మాత్రమే నమ్ముకున్నారు. అమెరికా పట్ల ముస్లింల వైఖరి తెలిసేంత వరకు వాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయాలని' ట్రంప్ కోరారు. కాగా దక్షిణ కరోలినాలో జరిగిన ప్రచారంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డిమాండ్లనే చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలని ఖండిస్తూ వివిధ రాష్ట్రాల గవర్నలు విమర్శలు ఎక్కుపెట్టారు. డోనాల్డ్ మాటలను వైట్ హౌస్ వర్గాలు తప్పుపట్టాయి. అమెరికా విలువలకు, జాతీయ భద్రతా వైఖరికి ట్రంప్ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. అటు ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ తీవ్రంగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మతి తప్పినవిగానూ, రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. అలాగే ఓహియా, సౌత్ కరోలినా, న్యూజెర్సీ గవర్నర్లు డొనాల్డ్ వ్యాఖ్యలతో విభేదించారు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతకుముందు వికలాంకుడైన ఓ జర్నలిస్టును అనుకరిస్తూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఓ మహిళా అభిమాని ఛాతీపై ట్రంప్ సంతకం చేసి సంచలనం సృష్టించారు. -
సంచలనం రేపిన ఆటోగ్రాఫ్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా ఓ మహిళ ఛాతీపై సంతకం చేశారు. వర్జీనియాలోని మనస్సాస్లో ప్రిన్స్ విలియమ్ కంట్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ట్రంప్ ఆమె ఛాతీపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఆటోగ్రాఫ్‌ను అందుకున్న ఆ అభిమాని ఇక తాను స్నానం చేసేది లేదంటూ గాల్లోకి ముద్దులు విసిరి మరింత అలజడి రేపారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. రోజురోజుకీ ఆటవికులుగా తయారవుతున్న ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు. -
బాబీ జిందాల్‌కు పెరుగుతున్న మద్దతు
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీపడేందుకు భారతీయ సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్ని విధాల అర్హుడైన వ్యక్తి అని ఆ రాష్ట ప్రజలు భావిస్తున్నారని తాము చేపట్టిన సర్వేలో వెల్లడైందని రిపబ్లికన్ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 2016లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో లూసియానా రాష్ట్ర ప్రజలు బాబీ జిందాల్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ సర్వే పేర్కొంది. కాగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు అనుకూలంగా 37 శాతమే ఓటు వేశారని వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా హెల్త్ కేర్ చట్టంపై సంతకం చేయడంతో స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా అమెరికన్లు ఆ చట్టాన్ని ఒబామా కేర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బాబీ జిందాల్ వరుసగా రెండో సారి లూసియానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మూడో సారి ఆయన ఆ పదవిని చేపట్టేందుకు అంతగా ఇష్టపడటం లేదని పలువురు వెల్లడిస్తున్నారు.