వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టి రేసులో శరవేగంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించారు.
సీఎన్ఎన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపగలను.. అందుకు రష్యా చైనాతో సైనిక సంబంధాలను నిలిపివేయాలని.. అలాగే క్యివ్, డాన్ బాస్ నాటోలో చేరకుండా ఉండాలన్నారు. రష్యాను ఓడించడం నా ఉదేశ్యం కాదు కానీ అమెరికాను గెలిపించడమే నా ఉద్దేశ్యమని అన్నారు.రష్యా-చైనా కలగలసిన సైన్యం ప్రపంచంలోనే పెద్దదని అది అమెరికాకు ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు.
ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ప్రమేయం పెరిగే కొద్దీ రష్యా చైనాకు మరింత దగ్గరవుతూ ఉంటుందని.. ఏ రాజకీయ పార్టీ ఈ ప్రస్తావనే తీసుకురావడం లేదని.. ఈ సమస్యనుకి పరిష్కరించడానికి వీలయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళతానని అన్నారు. ప్రస్తుతమున్న బైడెన్ ప్రభుత్వం రష్యా చైనా భాగస్వామ్యాన్ని వేరుచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
కానీ అది సాధ్యపడాలంటే మనం మొదటిగా పుతిన్ - జిన్ పింగ్ మధ్య గీత గీయాల్సిన అవసరముంది. లేదంటే 1972లో నిక్సన్ చైనా వెళ్లిన నాటి పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. నా దృష్టికి పుతిన్ ఈ తరం మావోలా కనిపిస్తుంతయారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాస్కో వెళ్లి రష్యాను చైనా బిగి కౌగిలి నుండి విడిపిస్తానని అన్నారు. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రధానమైనదని వెల్లడించారు.
I will end the Ukraine War on terms that require Putin to exit his military alliance with China. The goal shouldn’t be for Russia to “lose.” It should be for the U.S. to *win.* https://t.co/pmsxaiFR2I
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 18, 2023
ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment