Indian American Congressmen Comes In Support Of Vivek Ramaswamy - Sakshi
Sakshi News home page

రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటున్న మత ప్రచారకుడు..

Published Thu, Jul 27 2023 2:14 PM | Last Updated on Thu, Jul 27 2023 2:45 PM

Indian American Congressmen Come Out In Support Of Vivek Ramaswamy - Sakshi

వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న వివేక్ రామస్వామి హిందువు అని ఆయనకు ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడు కున్నేమాన్ ప్రసంగం చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ  నేపథ్యంలో ఇండో అమెరికన్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయనకు మద్దతుగా నిలిచారు. 

నెబ్రాస్కాలోని  నాన్-డినామినేషనల్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్  లో పనిచేస్తున్న హాంక్ కున్నేమాన్ ఇటీవల చేసిన ప్రసంగంలో.. రామస్వామి ఒక హిందువు అని ఆయనకు అండగా నిలిచినవారు దేవుని ఆగ్రహానికి గురవుతారని అన్నారు. 

ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ మతప్రచారకుడు కున్నేమాన్ మతోన్మాద వ్యాఖ్యలు విచారకరమని కాంగ్రెస్‌కు చెందిన రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా తీవ్రంగా ఖండించారు. వీరిద్దరూ కూడా రాజకీయంగా వివేక్ రామస్వామితో ఏకీభవించకపోయినా ఆయనపై కున్నేమాన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. 

రాజా కృష్ణమూర్తి రాస్తూ.. నేను వివేక్ కృష్ణమూర్తితో రాజకీయంగా ఏకీభవించను కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి అమెరికాలోని అన్ని రాజకీయ పార్టీలు హిందువులతో సహా ఏ మతానికి చెందిన వారినైనా స్వాగతించాలి. రామస్వామిపై చేసిన మతోన్మాద వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రిపబ్లికన్ ప్రతినిధులంతా ఈ సామరస్యాన్ని ఆచరిస్తారని అనుకుంటున్నాను. 

ఆర్ ఓ ఖన్నా స్పందిస్తూ.. వివేక్ రామస్వామికి నాకూ ఆత్మీయ విభేదాలున్న మాట వాస్తవం. కానీ ఆయన మతవిశ్వాసంపై చేసిన దాడి అసహ్యకరమైనది. అనేక మతాలకు చెందిన వారమైనా మనమంతా ఒక్కటే. అమెరికా రిపబ్లిక్షన్లు చాలా మంది రామస్వామి ఆదర్శాలకు అండగా నిలుస్తున్నారని.. అది వాస్తవమని రాశారు.  

వివాదాస్పదమైన కున్నేమాన్ వీడియో ప్రసంగం.. 
అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి.. మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైన రామస్వామికి మీరు అండగా ఉంటే మీరు దేవుడి ఆగ్రహానికి గురవుతారు. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా దేవుడి ఆగ్రహానికి గురై 2020లో పదవిని కోల్పోయారని ఇప్పుడు రామస్వామి విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. 

రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి రామస్వామి మాత్రం తన ప్రచార కార్యక్రమాలలో నేను వారి సంప్రదాయానికి చెందకపోయినా వారి విలువలను మాత్రం చాల గౌరవిస్తానని అన్నారు.      

ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement