photo credit: REUTERS
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు.
అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు.
‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు.
కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్‌లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment