న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి ఎక్స్(ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌పై కాల్పులు జరగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.
అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్‌ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగాలేదని వివేక్‌రామస్వామి విమర్శించారు.
‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్‌ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.
కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ ఎడమచెవికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment