![సంచలనం రేపిన ఆటోగ్రాఫ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51449214956_625x300.jpg.webp?itok=pElQrJ-q)
సంచలనం రేపిన ఆటోగ్రాఫ్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏకంగా ఓ మహిళ ఛాతీపై సంతకం చేశారు. వర్జీనియాలోని మనస్సాస్‌లో ప్రిన్స్ విలియమ్ కంట్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు. దీంతో ట్రంప్ ఆమె ఛాతీపై సంతకం చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఆటోగ్రాఫ్‌ను అందుకున్న ఆ అభిమాని ఇక తాను స్నానం చేసేది లేదంటూ గాల్లోకి ముద్దులు విసిరి మరింత అలజడి రేపారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ధ్వజమెత్తారు. రోజురోజుకీ ఆటవికులుగా తయారవుతున్న ఉగ్రవాదులపై పోరాడుతామని చెప్పారు.