డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ | Sakshi
Sakshi News home page

బలప్రదర్శన చేయాల్సిన పనిలేదు, ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్  

Published Mon, Aug 21 2023 8:51 AM

Trump To Skip Republican Presidential Debates Public Knows Who I Am - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. 

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు.  

రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది.  ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. 

రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు.           

ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..!

Advertisement
 
Advertisement
 
Advertisement