Republican presidential candidate Donald Trump
-
డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! -
’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి గబ్బుమాట మాట్లాడారు. తనకు తోడుగా ఓ దాడి చేసే కుక్కలాంటి వాడు కావాలని అన్నారు. తాను అధ్యక్షుడు అయితే, తనతోపాటు ఉండబోయే ఉపాధ్యక్షుడికి ఇలాంటి లక్షణాలు ఉండాలి అని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేశాడు. అంతేకాకుండా తాను ఈ మాట ఎవరిని ఆశ్చర్యపరిచేందుకో, ఆటలాడేందుకో చెప్పడం లేదని, అంతటి సమర్థంగా పనిచేసే లక్షణాలు ఉండాలని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్, మాజీ స్పీకర్ గింగ్రిచ్, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, అలబామా సెనేటర్ జెఫ్, మరో ఇద్దరు రాజకీయ నాయకులతోపాటు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడి అంశంపై చర్చ వచ్చినప్పుడు ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. పరిస్థితులకు తగినట్లుగా పనిచేసే వ్యక్తి తనకు తోడుగా ఉండాలని, ఒక్క మాటలో చెప్పాలంటే ఓ దాడి చేసే కుక్కలాగా పనిచేయగలగాలని, అలాంటివాడి తోడు తనకు అవసరం అని ట్రంప్ చెప్పారు. తనను ఎంతోమంది ఎన్నో మాటలతో విమర్శిస్తుంటారని, అయితే, వ్యక్తిగత అభిప్రాయాలు కలిస్తేనే సమర్థంగా ముందుకెళ్లగలమని ఆయన చెప్పారు.