public rally
-
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్‌షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్‌షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్‌లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్‌షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
28న గుజరాత్లో ప్రియాంక సంకల్ప్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ ఈనెల 28న తొలిసారిగా గుజరాత్లో భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మూడు దశాబ్ధాల నుంచి అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్లో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీతో కలిసి ఆమె ఈ ర్యాలీలో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీకి గట్టిపట్టు ఉండటం గమనార్హం. కాగా, అహ్మదాబాద్‌లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశానంతరం ఈ ర్యాలీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, అదే రోజు జరిగే ర్యాలీలో ప్రియాంక గాంధీ తొలిసారిగా పాల్గొననుండటంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. -
ఎంఐఎం ముందు మోకరిల్లిన టీఆర్ఎస్ : అమిత్ షా
నారాయణపేట : తెలంగాణలో త్రిముఖ పోరు సాగుతోందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎంఐఎం దగ్గర ఆత్మాభిమానం తాకట్టుపెట్టిన టీఆర్ఎస్, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న సిద్ధూ ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, మోదీ సారథ్యంలో దేశభక్తులతో కూడిన బీజేపీల మధ్య పోరాటం జరుగుతోందని అభివర్ణించారు. కేసీఆర్ తన కుటుంబసభ్యుల కోసం ముందస్తుకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం ముందు నిలువలేమనే భయంతో ముందస్తుకు కేసీఆర్ మొగ్గుచూపారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఆదివారం బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నారాయణపేట అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. -
ముంబయి టూ ఢిల్లీ రాహుల్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, ముంబయి : మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 29న ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జన్‌ఆక్రోశ్ ర్యాలీకి పార్టీ శ్రేణులను తరలించేందుకు ఆ పార్టీ ముంబయి విభాగం ఓ రైలును బుక్ చేసింది. రాహుల్ గాంధీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా ఈ రైలుకు నామకరణం చేసింది. 18 కోచ్‌ల ఈ ట్రైన్లో దాదాపు 1200 మందికి పైగా కార్యకర్తలు శుక్రవారం శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి ఢిల్లీకి తరలివెళతారని ముంబయి కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ముంబయి వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. ప్రతి కోచ్‌కు జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి జాతీయ దిగ్గజాల పేర్లు పెడతామని అన్నారు. జాతీయ నేతలను స్మరించుకునేందుకే కాకుండా కోచ్‌లను సులభంగా పార్టీ శ్రేణులు గుర్తించే వీలుంటుందని చెప్పారు. కాగా ప్రైవేట్ పార్టీలు రైళ్లను బుక్ చేసుకోవచ్చని, అయితే వాటి పేర్లను మార్చే వీలులేదని సెంట్రల్ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
‘బీసీలను వేధిస్తున్న బీజేపీ’
సాక్షి, ఛండీగర్ : యూపీ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విపక్షాల విజయంతో పాలక బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శల దాడి పెంచారు. దళితులు, బీసీలపై బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. ఛండీగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాస్త్రాలకు పదునుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె రోహిత్ వేముల విషాదాంతం, సహరన్పూర్ హింసాకాండ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభలో సహరన్పూర్ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ తనను అనుమతించలేదని ఆరోపించారు. పార్లమెంట్లో దళిత సమస్యలను లేవనెత్తనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తాను ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. తాను ఓబీసీల రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా మాయావతి విరుచుకుపడ్డారు. అగ్రవర్ణ భావజాలంతోనే కాంగ్రెస్ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు. -
మోదీకి అహం బాగా పెరిగిపోయింది
సాక్షి, ముంబై : ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మాటల తుటాలు పేల్చారు. ప్రధాని అయ్యాక మోదీకి అహం బాగా పెరిగిపోయిందంటూ హజారే విరుచుకుపడ్డారు. సంగలి జిల్లా అట్పది మండలంలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ ర్యాలీలో హజారే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ మూడేళ్లలో ప్రధాని మోదీకి 30కి పైగా లేఖలు రాశాను. ఒక్కదానికి కూడా బదులు ఇవ్వలేదు. ప్రధాని పదవి చేపట్టాక మోదీకి అహం బాగా పెరిగిపోయింది. అందులో నా లేఖలను బదులు ఇవ్వటం లేదు’’ అని హజారే విమర్శించారు. ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన రావటం ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చి 23 నుంచి మరోసారి ఆయన జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్, లోకాయుక్తా నియామకం, రైతులకు 5 వేల పెన్షన్, పంట ఉత్పత్తులకు అధిక రేట్ల విధింపు తదితర డిమాండ్లతో ఆయన ఉద్యమం చేపట్టబోతున్నారు. ఈలోగా మూడు ప్రజా ర్యాలీలను నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి ర్యాలీని నిర్వహించారు. ఇక ఢిల్లీ రాజకీయ పరిణామాల గురించి(ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం) ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు హజారే విముఖత వ్యక్తం చేశారు. -
మోదీకి బుద్ధి చెబుతా: రాహుల్
ధర్మశాల: అధిక విలువ నోట్ల రద్దు వల్ల పేదలు, రైతులు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్, జార్ఖాండ్, చత్తీస్ ఘడ్ లలో బీజేపీ ప్రభుత్వం కేవలం ఆదివాసి భూములను మాత్రమే లాక్కుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని రెండు ముక్కలు చేశారని అన్నారు. ఓ భాగంలో కేవలం ఒక శాతం ఉన్న ధనవంతులకు ఇచ్చేసి మరో భాగంలో మధ్యతరగతి, పేదలు ఉండేలా చేశారని వ్యాఖ్యానించారు. నోట్లకు రంగులేదన్న రాహుల్.. అవినీతిపరుల చేతిలోకి వెళ్లిన తర్వాతే అది నల్లడబ్బుగా మారుతోందని చెప్పారు. భారత్ లో కేవలం ఆరు శాతం మాత్రమే నల్ల డబ్బు ఉందని మిగిలినదంతా రియల్ ఎస్టేట్, బంగారం రూపంలో ఉందని పేర్కొన్నారు. నల్లడబ్బు కేవలం బ్యాంకు అకౌంట్లలో కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ రూపంలోకి మారుతోందని అన్నారు. స్విస్ బ్యాంకులో నల్లడబ్బును దాచుకున్న అవినీతి పరుల జాబితా మోదీ పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో లైన్లలో నిల్చున్న పేదలకు బీజేపీ మూడు రూపాయల లడ్డు ఇచ్చిందని, అదే విజయ్ మాల్యాకు రూ.1,200 కోట్లు ఎగ్గొట్టి విదేశాలు చెక్కేస్తే చూస్తూ ఊరుకుందని విమర్శించారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు భారత నగదు వ్యవస్ధకు కార్చిచ్చు పెట్టిందని అన్నారు. మోదీ సిమ్లా, ధర్మశాల ప్రజల నడ్డి విరిచారని ఉద్రేకంగా మాట్లాడారు. మోదీ తనతో పరాచకాలు ఆడుతున్నారని ఆయనకు త్వరలోనే బుద్ధి చెబుతానని అన్నారు. -
శ్రీనగర్‌లో పర్యటించనున్న నరేంద్రమోదీ
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 7న శ్రీనగర్‌లో నిర్వహించనున్నపబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారని గురువారం పీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ శ్రీనగర్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా బాగ్లిహార్ ప్రాజెక్టు రెండవ దశ పనులను మోదీ ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఈ పర్యటన సందర్భంగా మోదీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కశ్మీర్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఏప్రిల్ 19 విడుదల
-
ఏప్రిల్ 19 విడుదల
దేశం యావత్తు కళ్లల్లో ఒత్తులేసుకుని ఆయన కోసం చూస్తోంది.. ఇన్నాళ్లు ఎక్కడి కెళ్లాడని ప్రజలు అడిగితే.. 'బాబు తొందర్లోనే వచ్చేస్తాడ'ని అమ్మ మాటిచ్చింది. ఇప్పుడా మాట నిజం కానుంది. అవును.. దాదాపు నెల రోజులకు పైగా అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏప్రిల్ 19న ప్రజల ముందుకు, ప్రజలలోకి రానున్నారు. విశ్రాంతి కాలంలో ఎక్కుపెట్టిన బాణంలా తనను తాను సిద్ధం చేసుకున్న రాహుల్.. వస్తూనే ఎన్డీఏపై విరుచుకుపడనున్నారు. భూ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఏప్రిల్ 19న కాంగ్రెస్ కిసాన్ మోర్చా ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ పునరాగమనాన్ని నిర్ధారించారు. ఏప్రిల్ 20 నుంచి రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరవుతారని చెప్పారు.