శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీనగర్లో పర్యటించనున్నారు. నవంబర్ 7న శ్రీనగర్లో నిర్వహించనున్నపబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారని గురువారం పీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ శ్రీనగర్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
ఈ పర్యటన సందర్భంగా బాగ్లిహార్ ప్రాజెక్టు రెండవ దశ పనులను మోదీ ప్రారంభించనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఈ పర్యటన సందర్భంగా మోదీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో పీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కశ్మీర్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.