
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 29న ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జన్‌ఆక్రోశ్ ర్యాలీకి పార్టీ శ్రేణులను తరలించేందుకు ఆ పార్టీ ముంబయి విభాగం ఓ రైలును బుక్ చేసింది. రాహుల్ గాంధీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా ఈ రైలుకు నామకరణం చేసింది. 18 కోచ్‌ల ఈ ట్రైన్‌లో దాదాపు 1200 మందికి పైగా కార్యకర్తలు శుక్రవారం శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి ఢిల్లీకి తరలివెళతారని ముంబయి కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ముంబయి వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. ప్రతి కోచ్‌కు జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి జాతీయ దిగ్గజాల పేర్లు పెడతామని అన్నారు. జాతీయ నేతలను స్మరించుకునేందుకే కాకుండా కోచ్‌లను సులభంగా పార్టీ శ్రేణులు గుర్తించే వీలుంటుందని చెప్పారు. కాగా ప్రైవేట్ పార్టీలు రైళ్లను బుక్ చేసుకోవచ్చని, అయితే వాటి పేర్లను మార్చే వీలులేదని సెంట్రల్ రైల్వే అధికారి పేర్కొన్నారు.