జైపూర్: ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగే అంటున్నాడు జోస్ బట్లర్. ఐపీఎల్ 2018లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్‌ఫెక్ట్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు.. 95 పరుగులు) ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌అని, భార్య చూస్తుండగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.
(చదవండి: ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ)
నమ్మకాన్ని నిలబెట్టా: బేసిగ్గా నేను మిడిలార్డర్‌లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను పైకి పంపాలన్న నిర్ణయం కోచ్ షేన్ వార్న్‌దే. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది. ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్ ఇన్నింగ్స్’’ అని బట్లర్ చెప్పాడు. (బట్లర్ వీరబాదుడు హైలైట్స వీడియో కింద చూడొచ్చు)
ఆమె ముందుర..: ‘‘ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్ కూడా తనతో మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఆమె ముందర బెస్ట్ ఇన్నింగ్స ఆడటం, గెలవడం మర్చిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే బెస్ట్ టోర్నీ ఐపీఎల్. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో దొరుకుతుంది..’’ అని పేర్కొన్నాడు.
మ్యాచ్ రిపోర్ట్: వరుసగా రెండో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్... ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసును రసవత్తరంగా మార్చింది. పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (60 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సురేశ్ రైనా (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు ఓపెనర్ వాట్సన్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (23 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment