మాంచెస్టర్: తమ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాపై తొలిసారి 5–0తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరిదైన ఐదో వన్డేలో బట్లర్ (110 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటంతో ఇంగ్లండ్ వికెట్ తేడాతో నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత ఆసీస్ 34.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 208 పరుగులు చేసి నెగ్గింది. ఒకదశలో ఇంగ్లండ్ 114 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఆదిల్ రషీద్ (20)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ 81 పరుగులు జోడించాడు. రషీద్ ఔటయ్యాక జేక్ బాల్ (1 నాటౌట్)తో కలిసి బట్లర్ మిగతా పని పూర్తి చేశాడు.
ఇంగ్లండ్‌ను గెలిపించిన బట్లర్
Published Mon, Jun 25 2018 1:35 AM | Last Updated on Mon, Jun 25 2018 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment