బట్లర్ షో
ఏకైక టి20లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం
సౌతాంప్టన్: ఓపెనర్ బట్లర్ (49 బంతుల్లో 73 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోవడంతో శ్రీలంకతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఇక్కడి రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (26) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ (3/27)తో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టగా... జోర్డాన్ కూడా 3 వికెట్లతో రాణించాడు. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్... బట్లర్, మోర్గాన్ (39 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో మాథ్యుస్ రెండు వికెట్లు పడగొట్టాడు.