నార్త్‌సౌండ్: సొంతగడ్డపై వెస్టిండీస్ మరోసారి చెలరేగింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలం కావడంతో ఇంగ్లండ్ శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (24)దే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీమర్ రోచ్ (4/52), కెప్టెన్ హోల్డర్ (4/43) తమ పేస్‌తో ప్రత్యర్థిని పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే...14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 13 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 2009 తర్వాత ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. మూడో టెస్టు ఈ నెల 9నుంచి గ్రాస్ ఐలెట్‌లో జరుగుతుంది. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా విండీస్ కెప్టెన్ హోల్డర్‌పై ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించడంతో తర్వాతి మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment