మ్యాచ్‌కు వెళుతూ కింగ్స్‌ పంజాబ్ ఇలా.. వైరల్‌ | Before KXIPvDD Match This Is How Balle Balle Performed | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కు వెళుతూ కింగ్స్‌ పంజాబ్ ఇలా.. వైరల్‌

Published Sun, Apr 8 2018 3:43 PM | Last Updated on Sun, Apr 8 2018 3:43 PM

Before KXIPvDD  Match This Is How Balle Balle Performed - Sakshi

మొహాలీ: జట్టు పేరుకు తగ్గట్టే స్థానిక సంస్కృతుల్ని ప్రదర్శించడంలో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ యాజమాన్యం మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సొంత గడ్డపై తొలి మ్యాచ్‌ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్‌ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం సాయంత్రం కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స​ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌ ఆడేందుకుగానూ హోటల్‌ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్‌ వేశారు. తొలుత యువరాజ్‌, ఆ తర్వాత మిల్లర్‌, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసిన ఈ ‘బల్లే బల్లే’ వీడియోలను కింగ్స్‌ అఫీషియల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement