పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి చెందిన తర్వాత ఆనందం ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చిందో కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా వివరణ ఇచ్చారు. తమ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, దానిలో భాగంగానే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంపై ప్రీతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓటమే కాకుండా వరుస పరాజయాలు తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాల్ని దెబ్బ తీశాయని ఆమె పేర్కొన్నారు.
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు వెళ్లకుండా లీగ్ దశతోనే సరిపెట్టుకోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన జట్టు ప్లేఆఫ్‌కు చేరకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇది తనను చాలా బాధించిందని తెలిపిన ప్రీతి.. కింగ్స్ పంజాబ్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. వచ్చే ఏడాది ఈ తరహా పరిస్థితి రాదని అనుకుంటున్నానని ప్రీతి ఆశాభావం వ‍్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment