రాహుల్‌ ముంబై.. పాండ్యా పంజాబ్‌..!! | KL Rahul And Hardik Pandya Swaps Jerseys | Sakshi
Sakshi News home page

రాహుల్‌ ముంబై.. పాండ్యా పంజాబ్‌..!!

Published Thu, May 17 2018 9:51 AM | Last Updated on Thu, May 17 2018 3:00 PM

KL Rahul And Hardik Pandya Swaps Jerseys - Sakshi

జెర్సీలు మార్పిడి తర్వాత ఆలింగనం చేసుకుంటున్న పాండ్యా, రాహుల్‌

సాక్షి, హైదరాబాద్‌ :  ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ 19వ ఓవర్‌లో ఔట్‌ కావడంతో కింగ్స​ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఓటమి పాలైంది. దీంతో రాహుల్‌ కంటతడి పెట్టుకున్నారు కూడా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్ధిక్‌ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి స్పోర్ట్స్‌మ్యాన్‌ స్పిరిట్‌ను చాటుకున్నారు.

అందుకు ప్రతిగా రాహుల్‌ కూడా పంజాబ్‌ జెర్సీని హర్ధిక్‌కు అందజేశారు. 94 పరుగుల వద్ద రాహుల్‌ను బుమ్రా అద్భుతమైన బాల్‌తో ఔట్‌ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement