క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ (మొహాలీ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఐపీఎల్‌లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రహ్మాన్ నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు రహ్మాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అఫ్గానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరఫున అతిపిన్న వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడన్న విషయం తెలిసిందే.
అతి తక్కువ వయసులో ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్‌గానూ ముజీబ్ ఉర్ రహ్మాన్ రికార్డు నమోదుచేశాడు. ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ తరఫున అరంగ్రేటం చేశాడు. 17 ఏళ్ల 11 రోజుల వయసులో తొలి ఐపీఎల్ ఆడుతున్న బౌలర్ రహ్మాన్ .. బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ రికార్డును చెరిపేశాడు. ఇప్పటివరకూ 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ పేరిట ఈ రికార్డ్ ఉండేది.
పిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన టాప్-5 ఆటగాళ్లు
ముజీబ్ ఉర్ రహ్మాన్ 17 ఏళ్ల 11 రోజులు
సర్ఫరాజ్ ఖాన్ 17 ఏళ్ల 177 రోజులు
ప్రదీప్ సంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజులు
వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల 199 రోజులు
రాహుల్ చహర్ 17 ఏళ్ల 247 రోజులు
Comments
Please login to add a commentAdd a comment