Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది.
కెప్టెన్‌గా మళ్లీ అతడే
అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.
కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది.
సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి
ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది.
టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.
చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
Comments
Please login to add a commentAdd a comment