టీ20ల‌లో కోహ్లి ప్ర‌పంచ రికార్డు.. ఏకైక బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌ | Ind Vs AFG: Virat Kohli World Record After Scoring 29 Runs In 16 Balls, Achieves Unique Feat - Sakshi
Sakshi News home page

Virtat Kohli: టీ20ల‌లో కోహ్లి ప్ర‌పంచ రికార్డు.. ఏకైక బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌

Published Mon, Jan 15 2024 8:11 PM | Last Updated on Tue, Jan 16 2024 2:08 PM

Ind vs Afg: Virat Kohli World Record After Scoring 29 Runs in 16 Balls - Sakshi

అంత‌ర్జాతీయ టీ20 పున‌రాగ‌మ‌నం సంద‌ర్భంగా టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి స‌రికొత్త రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వ‌ర‌కు ఏ క్రికెట‌ర్‌కూ సాధ్యం కాని ఫీట్ న‌మోదు చేశాడు. టీ20 ప్రపంచ‌క‌ప్‌-2022 త‌ర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు.

ఈ క్ర‌మంలో... టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌-2024కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖ‌రి సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గ‌నిస్తాన్‌తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న రెండో టీ20 సంద‌ర్భంగా బ‌రిలోకి దిగాడు.

16 బంతుల్లో 29
కాగా.. ఇండోర్ వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ప‌ర్యాట‌క అఫ్గ‌నిస్తాన్ జ‌ట్టును 172 ప‌రుగుల‌కు ఆలౌట్ చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో య‌శ‌స్వి జైస్వాల్‌(68), శివం దూబే(63- నాటౌట్) దంచి కొట్ట‌గా.. కోహ్లి సైతం దూకుడుగా ఆడాడు. కేవ‌లం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 ప‌రుగులు సాధించాడు.

ప్ర‌పంచంలో ఏకైక క్రికెట‌ర్‌గా..
ఈ క్ర‌మంలో ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌ల‌లో 2000 ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి.  త‌ద్వారా ప్ర‌పంచంలో ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా చ‌రిత్రకెక్కాడు.  ఇప్ప‌టి వ‌ర‌కు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. 

వ‌న్డేల్లోనూ ఈ రికార్డుల రారాజే
ఇక వ‌న్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్‌లో ఈ రికార్డుల రారాజే అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచ‌రీలు, న‌ల‌భై ఫిఫ్టీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. అఫ్గ‌నిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అన్న‌ట్లు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. పేస‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్‌కు వికెట్ స‌మ‌ర్పించుకోవ‌డం గ‌మ‌నార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement