
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK
— Johns. (@CricCrazyJohns) June 20, 2024
ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్
ఈ మ్యాచ్‌లో విరాట్ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్‌బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్‌బోర్న్ ఐకానిక్ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.