![IPL 2025: Mujeeb Ur Rahman replaces injured Ghazanfar in Mumbai Indians](/styles/webp/s3/article_images/2025/02/16/Mujeeb.jpg.webp?itok=P3XDEk7E)
ఐపీఎల్-2025కు సీజన్‌కు ముంబై ఇండియన్స్ స్పిన్నర్, అఫ్గానిస్తాన్ నయా స్పిన్ సంచలనం ఘజన్‌ఫర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న ఘజన్‌ఫర్.. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి దూరమయ్యాడు.
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని మరో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసుకుంది.
ముజీబ్‌ను రూ. 2 కోట్ల కనీస ధరకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. "ఐపీఎల్ 18వ సీజన్‌కు అల్లా ఘజన్‌ఫర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ముజీబ్-ఉర్-రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకున్నాము. ముజీబ్‌కు ఇప్పటికే ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అతడు 19 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అతడిని బెస్‌ప్రైస్‌రూ. 2 కోట్లకు కొనుగోలు చేశాము" అని ముంబై ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా టీ20ల్లో ముజీబ్‌కు మంచి రికార్డు ఉండడంతో ముంబై తమ జట్టులోకి తీసుకుంది. పవర్‌ప్లేలో తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. అయితే పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ముజీబ్‌ను అఫ్గాన్ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అతడి స్ధానంలో ఏఎం ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు. కానీ ఘజన్‌ఫర్ గాయం కారణంగా దూరం కావడంతో ముజీబ్‌ను తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అఫ్గాన్ సెలక్టర్లు మాత్రం నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు.
ముంబై ఇండియన్స్ జట్టు
జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.50 కోట్లు), నమన్ ధీర్ (రూ. 5.25 కోట్లు), రాబిన్ మింజ్ (రూ. 65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 50 లక్షలు), దీపాక్ రికల్టన్ (ఆర్. 2 కోట్లు), దీపక్.9 కోట్లు. కోటి), అల్లా గజన్‌ఫర్ (రూ. 4.80 కోట్లు), విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు), అశ్వనీ కుమార్ (రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), రీస్ టోప్లీ (రూ. 75 లక్షలు), కృష్ణన్ శ్రీజిత్ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ బావా (ఆర్. 30 లక్షలు), సత్యానారాయణ 30 లక్షలు. బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్ (రూ. 30 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment