ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్‌లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్‌లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది.
విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది.
కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్‌లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్‌హక్ ఫారూకీని ఎస్‌ఆర్‌హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.
చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ!
Comments
Please login to add a commentAdd a comment