చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్, ఒటాగో వోల్ట్స్ జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లూ వరుసగా రెండు రోజుల పాటు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.... మూడో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండానే క్వాలిఫయింగ్‌లో ‘పాస్’ అయ్యాయి.
పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్, శ్రీలంకకు చెందిన కందురతా మారూన్స్‌కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయింగ్ చివరి మ్యాచ్‌ల ద్వారా ఎవరు ‘టాప్’ అనేది తేలుతుంది. ఒటాగో, సన్‌రైజర్స్‌ల మ్యాచ్ విజేత క్వాలిఫయర్-1గా ప్రధాన పోటీల బరిలోకి దిగుతుంది. ఫైసలాబాద్, కందురతాల మధ్య జరిగే పోరు నామమాత్రం.
ఒంటిచేత్తో....
మొహాలీ: ఇంగ్లండ్ నుంచి బుధవారం ఉదయం మొహాలీ వచ్చిన టెన్ డష్కటె... కేవలం ఆరు గంటల విశ్రాంతి తర్వాత నేరుగా మైదానంలోకి దిగాడు. సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసటను అధిగమించి ఒంటిచేత్తో ఒటాగో వోల్ట్స్‌ను గెలిపించాడు.
డష్కటె (2/9, 32 బంతుల్లో 64; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆల్‌రౌండ్ షో తో... పీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ జట్టు కందురతా మారూన్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒటాగో ఫీల్డింగ్ ఎంచుకోగా... కందురతా మారూన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగ (56 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడినా... సంగక్కర సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో ఒటాగో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కందురతా ఓ మాదిరి స్కోరు సాధించింది. ఒటాగో బౌలర్ బట్లర్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. టెన్ డష్కటె రెండు వికెట్లు తీసుకున్నాడు. ఒటాగో జట్టు 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. డష్కటెతో పాటు నీషమ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 30 బంతుల్లో 57 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్లు బ్రూమ్ (25), రూథర్‌ఫోర్డ్ (20) కూడా రాణించారు. కందరుతా బౌలర్ దిల్హారా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండ్ షో కనబరచిన టెన్ డష్కటెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) బి.మెకల్లమ్ (బి) బట్లర్ 76; షెహాన్ జయసూర్య (బి) మెక్‌మిలన్ 13; సంగక్కర (సి) టెన్ డష్కటె (బి) నీషమ్ 13; దిల్హారా (సి) రూథర్‌ఫోర్డ్ (బి) టెన్ డష్కటె 15; తిరిమన్నె (సి) బి.మెకల్లమ్ (బి) టెన్ డష్కటె 6; చమరసిల్వ ఎల్బీడబ్ల్యు (బి) బట్లర్ 6; లోకురాచి (బి) బట్లర్ 0; కులశేఖర (బి) వాగ్నర్ 14; కాందంబి రనౌట్ 5; రణ్‌దివ్ నాటౌట్ 1; మెండిస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 2, వైడ్లు 2) 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1-25; 2-52; 3-99; 4-112; 5-134; 6-134; 7-135; 8-146; 9-154.
బౌలింగ్: బట్లర్ 4-0-21-3; మెక్‌మిలన్ 3-0-17-1; వాగ్నర్ 4-0-28-1; ఎన్.మెకల్లమ్ 2-0-30-0; నీషమ్ 4-0-39-1; టెన్ డష్కటె 2-0-9-2; బెర్డ్ 1-0-7-0.
ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) కాందంబి (బి) దిల్హారా 25; రూథర్‌ఫోర్డ్ (సి) దిల్హారా (బి) రణ్‌దివ్ 20; బి. మెకల్లమ్ (స్టం) సంగక్కర (బి) దిల్హారా 8; టెన్ డష్కటె (సి) కులశేఖర (బి) దిల్హారా 64; నీషమ్ నాటౌట్ 32; ఎన్.మెకల్లమ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బైస్ 3, లెగ్‌బైస్ 2, వైడ్లు 2, నోబాల్ 1) 8; మొత్తం (18 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-31; 2-45; 3-89; 4-146.
బౌలింగ్: కులశేఖర 3-0-31-0; రణ్‌దివ్ 4-0-36-1; మెండిస్ 4-0-26-0; దిల్హారా 4-0-20-3; లోకురాచి 2-0-24-0; జయసూర్య 1-0-15-0.
అలవోకగా...
మొహాలీ: చాంపియన్స్‌లీగ్‌లో హైదరాబాద్‌తో ఆడాల్సిన జట్లన్నింటికీ హై అలెర్ట్. శిఖర్ ధావన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ధావన్ (50 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించడంతో... సన్‌రైజర్స్ అలవోకగా ఫైసలాబాద్‌పై నెగ్గి లీగ్ ప్రధాన పోటీలకు అర్హత సాధించింది. పీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు.
ఇషాంత్, మిశ్రా, కరణ్, పెరీరా, స్యామీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. సన్‌రైజర్స్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు), ధావన్ కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... డుమిని (27 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) నిలకడగా ఆడాడు. చివర్లో స్యామీ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (1/13)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమ్మర్ మొహమ్మద్ (సి) మిశ్రా (బి) స్యామీ 31; అలీ వకాస్ (సి) ఆశిష్ (బి) మిశ్రా 16; ఆసిఫ్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; మిస్బావుల్ హక్ నాటౌట్ 56; ఇమ్రాన్ ఖాలిద్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 2; ఖుర్రమ్ షెహ్‌జాద్ (బి) పెరీరా 4; సల్మాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు (బైస్ 4, లెగ్‌బైస్ 6, వైడ్లు 4, నోబాల్ 1) 15; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 127.
వికెట్ల పతనం: 1-48; 2-50; 3-69; 4-92; 5-101.
బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; ఇషాంత్ 4-0-26-1; పెరీరా 4-0-33-1; అమిత్ మిశ్రా 4-1-13-1; కరణ్ శర్మ 2-0-11-1; స్యామీ 2-0-14-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) ఖుర్రమ్ (బి) అదిల్ 23; శిఖర్ ధావన్ (బి) ఖాలిద్ 59; డుమిని నాటౌట్ 20; సామంత్రె ఎల్బీడబ్ల్యు (బి) ఖాలిద్ 0; స్యామీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 8, నోబాల్ 1) 15; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి) 131.
వికెట్ల పతనం: 1-68; 2-112; 3-112.
బౌలింగ్: సమియుల్లా 4-0-36-0; అసద్ అలీ 3.3-0-27-0; అజ్మల్ 4-0-25-0; అదిల్ 3-0-14-1; ఖుర్రమ్ 1-0-9-0; ఖాలిద్ 2-0-14-2.
ఒటాగో, సన్‌రైజర్స్ ‘పాస్’
Published Thu, Sep 19 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement
Advertisement