హార్దిక్ పాండ్యా (Photo Credit: IPL/BCCI)
Punjab Kings vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌కు 12 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు.
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కిది తొలి తప్పిదం కావున 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం ఐపీఎల్ నిర్వాహకులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తర్వాత జరిమానా ఎదుర్కొన్న మూడో కెప్టెన్ హార్దిక్ పాండ్యా.
మూడో విజయం
ఇదిలా ఉంటే.. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బింద్రా స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ విజయం సాధించింది. సొంతమైదానంలో ధావన్ సేనను 6 వికెట్ల తేడాతో ఓడించి తమ ఖాతాలో మూడో విజయం నమోదు చేసుకుంది.
మోహిత్ మాయ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రీఎంట్రీలో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ అదరగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.
అదరగొట్టిన గిల్
ఇక పంజాబ్ విధించిన లక్ష్యానికి బదులిచ్చేందుకు బరిలోకి దిగిన గుజరాత్ ఆఖరి బంతి వరకు విజయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (30) రాణించగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్(67)తో ఆకట్టుకున్నాడు. అయితే, ఆఖర్లో గెలుపు సమీకరణం ఉత్కంఠ రేపగా.. ఓ బంతి మిగిలి ఉండగానే ఫినిషర్ రాహుల్ తెవాటియా బౌండరీ బాది గుజరాత్ గెలుపును ఖరారు చేశాడు.
చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు..
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
Comments
Please login to add a commentAdd a comment