శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరోసారి రోహిత్‌కు టాస్ కలిసిరాలేదు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై మంచు ప్రభావం కారణంగా టాస్ కీలకంగా మారిన దశలో రోహిత్ టాస్ కోల్పోయాడు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా శ్రీలంక బరిలోకి దిగుతుండగా.. భారత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుంధర్‌ను తీసుకున్నారు.. తొలి మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయగా.. ఈ మ్యాచ్‌తో 18 ఏళ్ల వాషింగ్టన్ సుంధర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే రహానేను తీసుకుంటారని అందరు భావించగా మరో సారి అతనికి మొండిచేయ్యే ఎదురైంది. వాషింగ్టన్ సుంధర్ మ్యాచ్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్‌లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా సుంధర్ గుర్తింపు పొందాడు. తొలుత టీ20లకే సెలక్ట్ అయిన ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఆలౌరౌండర్ కేదార్ జాదవ్ గాయంతో జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.