చండీగఢ్: పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్‌ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఏఎస్‌ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్‌పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
పర్వీన్ కౌర్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహిస్తోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. నిందుతుడ్ని అరెస్టు చేయాలండే డబ్బు ఇవ్వాల్సిందేనని ఏఎస్‌ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు డబ్బు ఇచ్చింది.
చదవండి: ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు..
Comments
Please login to add a commentAdd a comment