
సాక్షి, మొహాలీ : భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్రికెట్ యువ అభిమానం అమాంతం పిచ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోని వద్దకు పరుగులు తీశాడు. వెంటనే తన చేతిలో ఉన్న అట్టాముక్కపై ఆటోగ్రఫీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి వ్యవహారం చూసి ధోని ఆశ్చర్యపోయాడు. భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్‌మెన్ చేలరేగిపోయారు.
టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా కీపర్‌గా ధోనీ ఫీల్డ్‌లో ఉన్నారు. అదే సమయంలో ఆట జరుగుతుండగానే ఓ వీర అభిమాని ధోని వైపు దూసుకొచ్చాడు. వెంటనే ఆయన ఆటోగ్రఫీని అడిగి అనంతరం ధోని పాదాలు తాకి వందనం చేసుకున్నాడు. అతడు చేసిన పనికి ఏమాత్రం విసుక్కోని ధోని సంతోషంగానే అతడిని తిరిగి పంపించాడు. ఇది చూసిన అక్కడి కెమెరామెన్ ఆ దృశ్యాలను క్లిక్ మనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment