విరుష్క రిసెప్షన్‌కు స్పెషల్‌ గెస్ట్‌ | Virat Kohli invites Sri Lanka cricket superfan Gayan Senanayake | Sakshi
Sakshi News home page

విరుష్క రిసెప్షన్‌కు స్పెషల్‌ గెస్ట్‌

Published Wed, Dec 27 2017 3:47 PM | Last Updated on Wed, Dec 27 2017 7:08 PM

Virat Kohli invites Sri Lanka cricket superfan Gayan Senanayake - Sakshi

ముంబై : మంగళవారం ముంబైలో అట్టహాసంగా సాగిన భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల రెండో రిసెప్షన్‌కు ఓ ప్రత్యేక అతిథి వచ్చాడు. కేవలం క్రికెటర్లు, బాలీవుడ్‌ తారల కోసమే ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్‌కు హాజరైన ఈ ముఖ్య అతిథి ఇటు క్రికెటర్‌.. అటు బాలీవుడ్‌ నటుడు కాదు.  అతను విరాట్‌ కోహ్లి అభిమాని మాత్రమే. పైగా అతను భారతీయుడు కూడా కాడు.

అభిమానులంటే అమితమైన ప్రేమ చూపించే కోహ్లి.. తన రిసెప్షన్‌కు శ్రీలంకకు చెందిన అభిమాని గయాన్ సెననాయకేను ఆహ్వానించి అందరి మనసులను గెలుచుకున్నాడు. దివ్యాంగుడైన గయాన్‌ సెననాయకే రిసెప్షన్‌కు హజరై విరుష్కకు శుభాకాంక్షలు తెలిపాడు. భారత్‌-శ్రీలంక సిరీస్‌ సందర్భంగా తమ జట్టుతో ఇక్కడికి వచ్చిన గయాన్‌ను కోహ్లి తన రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానించాడు. రిసెప్షన్‌కు హజరైన గయాన్‌ భారత క్రికెటర్లతో సందడి చేశాడు. విరుష్కతో ఫొటో దిగాడు. 

కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాక ముందే తనకు తెలుసన్న గయాన్‌.. తొలి సారి అండర్‌-19 ప్రపంచకప్‌ ముందు 2007లో శ్రీలంకకు వచ్చిన కోహ్లిని కలిసానన్నాడు. అప్పటి నుంచి లంకకు వచ్చినప్పుడల్లా టచ్‌లో ఉండేవాడినని తెలిపాడు. రిసెఫ్షన్‌కు రావడం ఆనందంగా ఉందని, కోహ్లి నాకు మంచి స్నేహితుడని గయాన్‌ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement