
ముంబై : విరుష్క జోడి ఇచ్చిన విందులో బాలీవుడ్ సీనియర్ తారలు సాంప్రదాయ చీరకట్టులో మెరిసారు. ముంబైలో అట్టహాసంగా సాగిన ఈ రిసెప్షన్‌కు హాజరైన సీనియర్ హీరోయిన్లు రేఖా, మాధురి దీక్షిత్, శ్రీదేవిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌లు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. షారుఖ్ ఖాన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్, దర్శకుడు కరణ్ జోహర్, ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జదా సైతం ఈ రిసెప్షన్‌కు హాజరై సందడి చేసింది.