ఇక నో రిసెప్షన్‌ | virat ,anushka's Another reception in Mumbai on 26th | Sakshi
Sakshi News home page

ఇక నో రిసెప్షన్‌

Published Sat, Dec 23 2017 12:02 AM | Last Updated on Sat, Dec 23 2017 12:02 AM

virat ,anushka's Another reception in Mumbai on 26th - Sakshi

విరాట్, అనుష్కల పెళ్లైపోయింది. రిసెప్షన్‌లే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పట్లో అయ్యేలా కూడా లేవు. మొన్న గురువారం ఢిల్లీలో ఒక రిసెప్షన్‌ అయింది. డిసెంబర్‌ 26 ముంబైలో ఇంకో రిసెప్షన్‌ కాబోతోంది. ఆ తర్వాత? బెంగళూరులో ప్లాన్‌ చేస్తున్నారట! ఢిల్లీలో విరాట్‌ ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడొకటి పెట్టారు. ముంబైలో అనుష్క బాలీవుడ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు కాబట్టి అక్కడొకటి పెడుతున్నారు. మరి బెంగళూరులో ఎందుకు? ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతుంటాడు కదా విరాట్‌.. అందుకే నా? కాదట! ‘ఇదే ఆఖరి రిసెప్షన్‌. ఇదయ్యాక ఎవరి పనుల్లో వాళ్లం పడిపోతాం’ అని అనౌన్స్‌ చెయ్యడానికట.

ఈ వార్త తెలియగానే రెండు వైపుల కుటుంబాలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ చాలా రిలీఫ్‌గా ఫీల్‌ అయ్యాయని బ్రేకింగ్‌ న్యూస్‌. విరాట్, అనుష్కలతో నానా రకాల దేశాలు, నానా రకాల నగరాలు తిరగలేక ఛస్తున్నారట వాళ్లు. అందుకే ఆఖరి రిసెప్షన్‌ అని తెలియగానే ఈ జంటకు తెలియకుండా సపరేట్‌ సపరేట్‌గా ఒకరికొకరు పార్టీలు, షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటున్నారట. మరోవైపు కోల్‌కతా, చెన్నై భగ్గుమన్నాయి. ‘మాపై ఈ దంపతులకు ఇంత చిన్న చూపేంటి? ఇక్కడెందుకు రిసెప్షన్‌లు పెట్టుకోరు! మేమంత హీనమా?’ అని ఆ సిటీల్లోని సెలబ్రిటీలు పటపటా పళ్లు నూరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement