ముంబై : టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య వివాదలున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే వీరి మధ్య ఈ వివాదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచే సత్తా కోహ్లి సేనకే ఉందని కుంబ్లే కొనియాడటం.. ముంబైలో జరిగిన కోహ్లి-అనుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
కుంబ్లే విరుష్కా రిసెప్షన్‌కు హజరవ్వడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. వారి గొడవలు ఆటలో భాగమే.. వ్యక్తిగతం కాదనీ కొందరంటే.. గొడవలు పక్కన పెట్టి కుంబ్లేను కోహ్లి ఆహ్వానించడం.. కుంబ్లే హజరవ్వడం వారి హుందాతానాన్ని చాటుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కోహ్లి రిసెప్షన్‌కు కుంబ్లే హజరయ్యాడంటే మేము నమ్మమని ట్రోల్ చేస్తున్నారు.
కోచ్‌గా కుంబ్లే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని కోహ్లి కామెంట్ చేయడం.. దీంతో కోచ్ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఇద్దరి మధ్య చాల పెద్ద వివాదం చోటుచేసుకుందని అందరు భావించారు. ఈ విషయం పలుమార్లు ఈ ఇద్దరు బాహటంగానే వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ 5న టీచర్స్‌డే సందర్భంగా కోహ్లి సోషల్ మీడియాలో తన గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో కుంబ్లే లేకపోవడంపై నెటిజన్లు కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికొకరు బర్త్‌డే విషెస్ చెప్పుకోకపోవడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment