ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే(నా)!
పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. స్వదేశానికి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. ‘ఆటగాడిగా నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. దేశానికి ఏది మంచిదని అనిపిస్తే అదే చేస్తాను.
ప్రస్తుతం ఇంటికి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజులు ఆలోచిస్తాను. ఏ విషయమైనా మా దేశంలో ప్రకటిస్తాను’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో మరోసారి రాజకీయంగా వివాదాస్పదమయ్యే వ్యాఖ్య చేశాడు. కోల్‌కతాలో తమకు మద్దతు ఇచ్చిన అభిమానులతో పాటు కశ్మీర్ నుంచి మొహాలీ వచ్చి తమకు మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలంటూ వ్యాఖ్యానించాడు.