మొహాలీ: ఒకే ఓవర్‌లో 30 పరుగులిచ్చి భారత పరాజయానికి కారకుడైన పేసర్ ఇషాంత్ శర్మను ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఓదార్చాడు. ప్రతీ బౌలర్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదేనని అన్నాడు. శనివారం నాటి మూడో వన్డేలో ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్‌ను ఫాల్క్‌నర్ చీల్చి చెండాడిన విషయం తెలిసిందే.
‘చివర్లో బౌలింగ్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకుంది. ఆసీస్ తరఫున నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఎదుటి బ్యాట్స్‌మన్ మన బౌలింగ్‌ను ఓ ఆట ఆడుకోవడం జరుగుతుంది. చాలాసార్లు నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాబట్టి బాధపడాల్సిందేమీ లేదు. ఇవన్నీ క్రికెట్‌లో భాగమే’ అని ఇషాంత్‌నుద్దేశించి ఫాల్క్‌నర్ అన్నాడు.
ఇషాంత్... బాధపడకు: ఫాల్క్‌నర్
Published Mon, Oct 21 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement