James Faulkner
-
రాజస్తాన్ రాయల్స్ తరపున యజ్వేంద్ర చహల్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లోరాజస్తాన్ ఓడినప్పటికి చహల్ మాత్రం ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చహల్ నిలిచాడు. ఈ సీజన్లో చహల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీశాడు. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున ఇదే అత్యుత్తమం. ఇక తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్ 28 వికెట్లతో దుమ్మురేపాడు. లీగ్‌లో రాజస్తాన్‌కు మరో రెండు మ్యాచ్‌లు మిగిలిఉండడం.. ఆ తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉండడంతో చహల్ ఫాల్కనర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక సోహైల్ తన్వీర్(22 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. 2020 సీజన్లో జోఫ్రా ఆర్చర్(20 వికెట్లు), 2019లో శ్రేయాస్ గోపాల్(20 వికెట్లు) సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నారు. చదవండి: IPL 2022: వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది -
పాక్ పరువును బజారుకీడ్చిన ఆసీస్ ఆల్‌రౌండర్.. పీఎస్ల్పై సంచలన ఆరోపణలు
James Faulkner Leaves PSL: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాక్ పరువు మరోసారి మంటగలిసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ సంచలన ఆరోపణలు చేస్తూ దాయాది దేశపు పరువును బజారుకీడ్చాడు. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఆఖరి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్పదని బడాయికి పోయే పాక్‌కు ఫాల్కనర్ చేసిన ఆరోపణలతో నోట మాటరావడం లేదు. ఈ దుస్థితికి పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజానే కారణమంటూ ఆ దేశ క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. 2/2 It hurts to leave as I wanted to help to get international cricket back in Pakistan as there is so much young talent and the fans are amazing. But the treatment I have received has been a disgrace from the @TheRealPCB and @thePSLt20 I’m sure you all understand my position. — James Faulkner (@JamesFaulkner44) February 19, 2022 కాగా, ఐపీఎల్లోలా కాకుండా పీఎస్ఎల్లో ప్రతి ప్లేయర్లకు ఓ నిర్ధిష్టమైన ధర ఉంటుంది. ప్లాటినం, డైమండ్ కేటగిరి అంటూ ఒక్కో విభాగపు ప్లేయర్లకు ఒక్కో ధర డిసైడ్ చేస్తారు నిర్వాహకులు. ప్లాటినం గ్రూప్‌లో ప్లేయర్లు రూ. 2.3 కోట్లు, డైమండ్ గ్రూప్‌లో ఉన్ ప్లేయర్లు సీజన్‌కి రూ. 1.15 కోట్ల చొప్పున దక్కించుకుంటారు. జేమ్స్ ఫాల్కనర్‌ను డైమండ్ కేటగిరి కింద దక్కించుకుంది క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు. ఇదిలా ఉంటే, 2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడైన ఫాల్కనర్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణే వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఫాల్కనర్.. ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్టు, 69 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. బ్యాటింగ్‌లో సెంచరీ, 4 అర్ధసెంచరీల సాయంతో 1200కు పైగా పరుగులు చేసిన ఫాల్కనర్.. బౌలింగ్‌లో 138 వికెట్లు పడగొట్టాడు. చదవండి: లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ -
అతడు ‘బాయ్ ఫ్రెండ్’ మాత్రమే: ఫాల్క్‌నర్
మెల్బోర్న్: తాను స్వలింగ సంపర్కుడిని కాదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ వివరణ ఇచ్చాడు. సోమవారం తన 29వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి రోస్లిన్ ఫాల్క్‌నర్‌తో పాటు రాబర్ట్ జబ్ అనే యువకుడితో కలిసి ఫాల్క్‌నర్ డిన్నర్ పార్టీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ‘బాయ్ ఫ్రెండ్‌తో’ డిన్నర్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అతడు ‘గే’ అంటూ వార్తలు వచ్చాయి. మంగళవారం ఫాల్క్‌నర్ వీటిని ఖండించాడు. రాబర్ట్ జబ్ స్నేహితుడని, ఐదేళ్లుగా ఒకే గదిలో ఉంటున్నామని స్పష్టం చేశాడు. దీనిపై తాము కూడా పొరపాటు పడ్డామని, ఫాల్క్‌నర్‌ను క్షమాపణలు కోరుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా పేర్కొనడం గమనార్హం. -
నేను గే కాదు; క్లారిటీ ఇచ్చిన ఫాల్క్‌నర్
‘నిన్న రాత్రి నేను చేసిన పోస్టు అపార్థాలకు దారి తీసింది. నేను స్వలింగ సంపర్కుడిని(గే) కాదు. ఏదేమైనప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటీ నుంచి నాకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఎవరిదైనా ప్రేమే. ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు. ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని ఉద్దేశం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్దతుగా నిలవడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తాను గేను కానని స్పష్టం చేశాడు. కాగా సోమవారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఫాల్క్‌నర్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ టుగెదర్ఫర్5ఇయర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఫాల్క్‌నర్ గే అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫాల్క్‌నర్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఈ కథనాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి కరీనా కేస్లెర్ మాట్లాడుతూ.. ‘ వ్యాపార భాగస్వామి, హౌజ్‌మేట్ అయిన స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధం గురించి ఫాల్క్‌నర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాం. పత్రికలు కూడా ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఏ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. View this post on Instagram There seems to be a misunderstanding about my post from last night, I am not gay, however it has been fantastic to see the support from and for the LBGT community. Let’s never forget love is love, however @robjubbsta is just a great friend. Last night marked five years of being house mates! Good on everyone for being so supportive. A post shared by James Faulkner (@jfaulkner44) on Apr 29, 2019 at 5:07pm PDT -
నేను ‘గే’ : ఫాల్క్‌నర్
తాను స్వలింగ సంపర్కుడినంటూ... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తన 29వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సంచలన ప్రకటన చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో సహా పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కావడం లేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. -
ఐపీఎల్: ఆ ఘనత సాధించిన తొలి ఆసీస్ క్రికెటర్
సాక్షి, పుణె : ఐపీఎల్ అంటేనే రికార్డులకు కేరాఫ్ ఆడ్రస్.. హీరోలు జీరోలవుతారు.. అనామక క్రికెటర్లు కింగ్‌లు అయిన సందర్బాలు కోకొల్లలు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ ఒక చక్కటి వేదిక అని దేశవిదేశీ ఆటగాళ్లు భావిస్తుంటారు. తాజాగా అంతగా గుర్తింపు పొందని ఆస్ట్రేలియా క్రికెటర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఆసీస్ హేమాహేమీలతో సాధ్యం కానిది 31 ఏళ్ల ఆండ్రూ టై సాధించాడు. తాజా సీజన్లో కింగ్స్ పంజాబ్ తరపున ఆడిన టై.. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి ఆసీస్ బౌలర్‌గా ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ల జాబితాలో ఆండ్రూ టై(24) రెండో స్థానంలో నిలవగా, తొలి స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013) కోనసాగుతున్నాడు. అయితే ఆ సీజన్లో డ్వేన్ బ్వేవో 32 వికెట్లు సాధించి ఆగ్రస్థానంలో ఉండటంతో ఫాల్కనర్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆండ్రూ టై 24 వికెట్లతో అదరగొట్టినప్పటికీ కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకోలేకపోయింది. ఇంకా చదవండి: ‘టాప్’లేపారు.. కానీ! -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...
లండన్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఫూటుగా మద్యం తీసుకోవడమే కాకుండా కారును నడిపి ఇంగ్లండ్ పోలీసులకు దొరికిపోయాడు. లాంకషైర్ తరఫున కౌంటీల్లో ఆడుతున్న తను గత గురువారం రాత్రి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసుల తనిఖీలో పట్టుబట్టాడు. పరిమితికి మించి మద్యం తీసుకున్నట్టు రుజువు కావడంతో ఆ రోజు రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈనెల 21న మాంచెస్టర్ కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. మరోవైపు ఈ సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సీరియస్‌గా స్పందించింది. తమ నియమావళిని ఉల్లంఘించినందుకు యాషెస్ సిరీస్ అనంతరం జరిగే వన్డే సిరీస్‌కు అతడిని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ క్రికెటర్ పై కేసు
మాంచెస్టర్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ పట్టుబడ్డాడు. మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తుండగా గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు చేసిన తనిఖీల్లో ఫాల్కనర్ దొరికిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టుకు తరలించారు. దీంతో అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసి.. జూలై 21 వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా తాగి డ్రైవ్ చేయడం వల్లే చోటు చేసుకునే పరిణామాల్ని గ్రహించాలని తాము ఫాల్కనర్ కు సూచించినట్లు టీమ్ ఫెర్మామెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హావర్డ్ తెలిపాడు. ఇది చాలా నిరాశకు గురిచేసిందన్నాడు. యువ క్రికెటర్లకు ఆదర్శం కావాల్సిన సీనియర్ క్రికెటర్ ఇలా చేయడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డాడు. ఈ తాజా ఉదంతంతో ప్రస్తుతం లాంక్ షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ కు ఆడుతున్న ఫాల్కనర్ భవితవ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టుకు అతన్ని ఎంపిక చేసే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. -
వరల్డ్ కప్ హీరోలకు షాక్
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుకున్న ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, విధ్వంసకర ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన మ్యాక్స్ వెల్ ను జట్టు నుంచి సాగనంపింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటన కోసం 17 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన టీమ్ లో వీరికి చోటు ఇవ్వలేదు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫాల్కనర్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచకప్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ ఫవద్ అహ్మద్, బ్యాట్స్ మన్ ఆడమ్ వొగ్స్, వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా జేమ్స్ పాటిస్సన్ ను ఎంపిక చేయలేదు. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడుతుంది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. రియాన్ హారిస్ ను ఒక్క యాషెస్ సిరిస్ కే ఎంపిక చేశారు. -
ఫాల్క్‌నర్ మెరుపులు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 301.... అప్పటికి స్కోరు 44 ఓవర్లలో 244/9. గెలవాలంటే 36 బంతుల్లో 57 పరుగులు చేయాలి. ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్ 14 పరుగులతో ఆడుతున్నాడు. చివరి ఆటగాడు మెక్కే క్రీజులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ విజయం లాంఛనమే అనుకున్నారు. ఈ దశలో ఫాల్క్‌నర్ (47 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు; 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది భారత్‌తో మొహాలీలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ... ఒంటిచేత్తో ఆసీస్‌ను గెలిపించాడు. చివరి వికెట్‌కు అజేయంగా 57 పరుగులు వస్తే... ఇందులో మెక్కే చేసింది కేవలం 2 మాత్రమే. మిగిలిన 55 ఫాల్క్‌నర్ చేయడం విశేషం. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతుల్లో మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఫాల్క్‌నర్ ఊచకోత కోయడంతో... శుక్రవారం గబ్బాలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు సాధించింది. మెర్గాన్ (99 బంతుల్లో 106; 4 ఫోర్లు; 6 సిక్స్) సెంచరీ చేయగా, బెల్ (84 బంతుల్లో 68; 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. కౌల్టర్ నైల్, ఫాల్క్‌నర్, మ్యాక్స్‌వెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 301 పరుగులు చేసి గెలిచింది. షాన్ మార్ష్ (69 బంతుల్లో 55; 7 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (39 బంతుల్లో 54; 8 ఫోర్లు) రాణించారు. జోర్డాన్, బ్రెస్నన్, రూట్లకు రెండు వికెట్లు దక్కాయి. -
ఇషాంత్... బాధపడకు: ఫాల్క్‌నర్
మొహాలీ: ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చి భారత పరాజయానికి కారకుడైన పేసర్ ఇషాంత్ శర్మను ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఓదార్చాడు. ప్రతీ బౌలర్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదేనని అన్నాడు. శనివారం నాటి మూడో వన్డేలో ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్‌ను ఫాల్క్‌నర్ చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ‘చివర్లో బౌలింగ్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకుంది. ఆసీస్ తరఫున నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఎదుటి బ్యాట్స్‌మన్ మన బౌలింగ్‌ను ఓ ఆట ఆడుకోవడం జరుగుతుంది. చాలాసార్లు నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాబట్టి బాధపడాల్సిందేమీ లేదు. ఇవన్నీ క్రికెట్లో భాగమే’ అని ఇషాంత్నుద్దేశించి ఫాల్క్‌నర్ అన్నాడు.