వరల్డ్ కప్ హీరోలకు షాక్ | James Faulkner not selected for Ashes Series | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ హీరోలకు షాక్

Published Tue, Mar 31 2015 9:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

వరల్డ్ కప్ హీరోలకు షాక్

వరల్డ్ కప్ హీరోలకు షాక్

సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుకున్న ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, విధ్వంసకర ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన మ్యాక్స్ వెల్ ను జట్టు నుంచి సాగనంపింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటన కోసం 17 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన టీమ్ లో వీరికి చోటు ఇవ్వలేదు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫాల్కనర్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచకప్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు.

పాకిస్థాన్ సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ ఫవద్ అహ్మద్, బ్యాట్స్ మన్ ఆడమ్ వొగ్స్, వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా జేమ్స్ పాటిస్సన్ ను ఎంపిక చేయలేదు. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడుతుంది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. రియాన్ హారిస్ ను ఒక్క యాషెస్ సిరిస్ కే ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement