డ్రంక్ అండ్ డ్రైవ్‌లో... | Drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...

Published Sun, Jul 5 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...

లండన్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఫూటుగా మద్యం తీసుకోవడమే కాకుండా కారును నడిపి ఇంగ్లండ్ పోలీసులకు దొరికిపోయాడు. లాంకషైర్ తరఫున కౌంటీల్లో ఆడుతున్న తను గత గురువారం రాత్రి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసుల తనిఖీలో పట్టుబట్టాడు. పరిమితికి మించి మద్యం తీసుకున్నట్టు రుజువు కావడంతో ఆ రోజు రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది.
 
 అంతేకాకుండా ఈనెల 21న మాంచెస్టర్ కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. మరోవైపు ఈ సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సీరియస్‌గా స్పందించింది. తమ నియమావళిని ఉల్లంఘించినందుకు యాషెస్ సిరీస్ అనంతరం జరిగే వన్డే సిరీస్‌కు అతడిని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement