James Faulkner Leaves PSL: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాక్ పరువు మరోసారి మంటగలిసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ సంచలన ఆరోపణలు చేస్తూ దాయాది దేశపు పరువును బజారుకీడ్చాడు. పీఎస్ఎల్ 2022 సీజన్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్పదని బడాయికి పోయే పాక్‌కు ఫాల్కనర్ చేసిన ఆరోపణలతో నోట మాటరావడం లేదు. ఈ దుస్థితికి పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజానే కారణమంటూ ఆ దేశ క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
2/2
— James Faulkner (@JamesFaulkner44) February 19, 2022
It hurts to leave as I wanted to help to get international cricket back in Pakistan as there is so much young talent and the fans are amazing.
But the treatment I have received has been a disgrace from the @TheRealPCB and @thePSLt20
I’m sure you all understand my position.
కాగా, ఐపీఎల్‌లోలా కాకుండా పీఎస్ఎల్‌లో ప్రతి ప్లేయర్లకు ఓ నిర్ధిష్టమైన ధర ఉంటుంది. ప్లాటినం, డైమండ్ కేటగిరి అంటూ ఒక్కో విభాగపు ప్లేయర్లకు ఒక్కో ధర డిసైడ్ చేస్తారు నిర్వాహకులు. ప్లాటినం గ్రూప్‌లో ప్లేయర్లు రూ. 2.3 కోట్లు, డైమండ్ గ్రూప్‌లో ఉన్ ప్లేయర్లు సీజన్‌కి రూ. 1.15 కోట్ల చొప్పున దక్కించుకుంటారు. జేమ్స్ ఫాల్కనర్‌ను డైమండ్ కేటగిరి కింద దక్కించుకుంది క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు.
ఇదిలా ఉంటే, 2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడైన ఫాల్కనర్, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణే వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఫాల్కనర్.. ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్టు, 69 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. బ్యాటింగ్‌లో సెంచరీ, 4 అర్ధసెంచరీల సాయంతో 1200కు పైగా పరుగులు చేసిన ఫాల్కనర్.. బౌలింగ్‌లో 138 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment