
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్‌లో కరాచీ కింగ్స్ (KK) కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
పీఎస్ఎల్‌లో డేవిడ్ వార్నర్ యాక్షన్ కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.
కెప్టెన్ సాబ్ మీరు సిద్దంగా ఉన్నారా? అని కరాచీ కింగ్స్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ డేవిడ్ భాయ్ ఆడటం ఇదే తొలిసారి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో వార్నర్ తన పేరును పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో నమోదు చేసుకున్నాడు. దీంతో జనవరిలో జరిగిన పీఎస్ఎల్ వేలంలో 300,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)కు వార్నర్‌ను కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది.
మసూద్‌పై వేటు..
గత సీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన షాన్ మసూద్‌పై కరాచీ కింగ్స్ వేటు వేసింది. అతడి స్ధానంలో డేవిడ్ వార్నర్‌కు తమ జట్టు పగ్గాలను కరాచీ అప్పగించింది. కాగా గతేడాదిలో జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి, వార్నర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్నాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో పాకిస్తాన్‌లో ఆడాలని ర్ణయించుకున్నాడు. పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో ప్లాటినం విభాగంలో అతడిని కేకే ఫ్రాంచైజీ దక్కించుకుంది. కరాచీ జట్టులో ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్,టిమ్ సీఫెర్ట్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు. ఇక పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.
కరాచీ కింగ్స్ జట్టు: అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్‌జామ్, ఎమ్బియామ్‌సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లా
చదవండి: IPL 2025: సీఎస్‌కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు?