పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పెషావర్ పరజాయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మహ్మద్ హాఫీజ్ 41 పరుగులతో రాణించాడు.
బాబర్ ఆజం సెంచరీ వృథా
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లోనే బాబర్ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్‌కు ఇదే తొలి సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు.
అతడితో పాటు మరోఓపెనర్ సైమ్ అయూబ్(74) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలవ్వడంతో బాబర్ విరోచిత శతకం వృథాగా మిగిలిపోయింది. ఇక ఇది బాబర్ టీ20 కెరీర్‌లో ఎనిమిదివ శతకం.
తద్వారా ఓ అరుదైన ఘనతను బాబర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా ఫించ్, వార్నర్, మైఖేల్ క్లింగర్ సరసన ఆజం నిలిచాడు. ఇక ఘనత సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.
Jersey # 56 lives rent-free in our hearts 🥰#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvQG pic.twitter.com/e6HsozWROG
— PakistanSuperLeague (@thePSLt20) March 8, 2023
Comments
Please login to add a commentAdd a comment