అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. కాగా దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment