Semi Final 1- IND vs AUS: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌ | India Vs Australia LIVE Updates, ICC Champions Trophy Semi-Final 2025 | Sakshi
Sakshi News home page

Semi Final 1- IND vs AUS: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

Published Tue, Mar 4 2025 2:06 PM | Last Updated on Tue, Mar 4 2025 4:23 PM

CT 2025 1st Semi Final Ind vs Aus: Smith Won Toss Palying XIs Varun In

ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final Updates: 
నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
26.6: రవీంద్ర జడేజా బౌలింగ్‌ ‌ జోష్‌ ఇంగ్లిస్‌ విరాట్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్‌ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్‌ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 144-4

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
22.3: లబుషేన్‌ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. జోష్‌ ఇంగ్లిస్‌ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 111/3 (22.4)

వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు
20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోరు: 105/2
స్మిత్‌ 36, లబుషేన్‌ 24 రన్స్‌తో ఉన్నారు.

పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ స్కోరు: 72/2
లబుషేన్‌ 4, స్మిత్‌ 23 పరుగులతో ఉన్నారు.

8.2: ట్రవిస్‌ హెడ్‌ అవుట్‌
ఆసీస్‌కు భారీ షాక్‌ తగిలింది. హార్డ్‌ హిట్టర్‌, ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ అవుటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మార్నస్‌ లబుషేన్‌ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 54/2 (8.2) 

కన్నోలీ డకౌట్‌
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్‌ కూపర్ కన్నోలీ డకౌట్‌ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన కూపర్‌ డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు.  3 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్‌, స్మీత్‌ కొనసాగుతున్నారు.  

టాస్‌ గెలిచిన ఆసీస్‌
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు నగారా మోగింది. దుబాయ్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్‌ చేశాం. బ్యాటింగ్‌ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.

బంతి స్పిన్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్‌ స్థానంలో కూపర్‌ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్‌ జాన్సన్‌స్థానాన్ని తన్వీన్‌ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.

దుబాయ్ లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా

అదే జట్టుతో భారత్‌
మరోవైపు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్‌లలో మేము రాణించాం. కివీస్‌తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు. 

కాగా గత మ్యాచ్‌లో పేసర్‌ హర్షిత్‌ రాణాపై వేటు వేసి స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్‌లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్‌తో పాటు ఆసీస్‌ కూడా వారివైపే మొగ్గు చూపింది.

తుదిజట్లు ఇవే
భారత్‌
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్.

ఆస్ట్రేలియా 
కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement