
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్‌కు ప్రయత్నించి శతకాన్ని చేజార్జుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. దెబ్బతిన్న పులిలా రోహిత్ మైదానంలో గర్జిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment