
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అంతకు ముందు టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
తిరుమన్నే వేసిన 21 ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్(68) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment