మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్‌కు ఈ మ్యాచ్‌లో రోహిత్ తన బ్యాట్‌తో బదులిచ్చాడు. ధర్మశాల మ్యాచ్‌లో లక్మల్ రోహిత్(2)ను పెవిలియన్‌కు పంపించిన విషయం తెలిసిందే. రోహిత్ ఆడిన వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డు నమోదు చేశాడు.
రెండో వన్డేల్లో లక్మల్ వేసిన 43 ఓవర్‌లో రోహిత్ వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాది లక్మల్‌కు ముచ్చెమటలు పట్టించాడు. లక్మల్ వేసిన ఓ వైడ్‌ను కలుపుకొని ఈ ఓవర్‌లో భారత్‌కు 26 పరుగులు జమయ్యాయి. ఇక అనంతరం ప్రదీప్ బౌలింగ్‌లో మరో మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ మరో రెండు సిక్సులు, పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్ బాదాడు. దీంతో రోహిత్ వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాదినట్లైంది.
రోహిత్ ‘డబుల్’ రికార్డులు
ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. తాజా డబుల్‌తో వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డే చరిత్రలో మెత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్‌వే 3 డబుల్ సెంచరీలు కావడం విశేషం. రోహిత్ తొలి డబుల్(209) సెంచరీ 2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో నమోదు చేశాడు. ఇక ఇదే శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(264)ను 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో సాధించాడు. మిగతా నాలుగు డబుల్ సెంచరీలు సచిన్ టెండూల్కర్(200) , సెహ్వాగ్(219), క్రిస్‌గేల్ (215) మార్టిన్‌గప్టిల్ (237)ల పేరిట ఉన్నాయి.
♦ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సెహ్వాగ్(219) పేరిట ఉంది. 2011 డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌పై సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ కెప్టెన్సీ వహించడంతో ఈ రికార్డు తన సొంతమైంది.
♦ శ్రీలంకపై అత్యధిక పరుగుల చేసిన తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment