మొహాలీ: రంజీట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు చేరింది. పంజాబ్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 270 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక ముందుకు వెళ్లింది. 29 నుంచి హైదరాబాద్‌లో జరిగే టైటిల్ పోరులో మహారాష్ట్రతో కర్ణాటక తలపడుతుంది.
ఫైనల్‌కు జోల్ దూరం
న్యూఢిల్లీ: మహారాష్ర్ట స్టార్ బ్యాట్స్‌మన్ విజయ్ జోల్ రంజీ ఫైనల్‌కు దూరమవుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ కోసం బెంగళూరులో నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఈ యువ క్రికెటర్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఈ క్యాంప్ జాతీయ క్రికెట్ అకాడమీలో మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజే జోల్ అక్కడ రిపోర్ట్ చేశాడు. బోర్డు నిర్ణయంపై మహారాష్ట్ర కోచ్ సురేంద్ర భావే అసంతృప్తి వ్యక్తం చేశారు.
రంజీ ఫైనల్లో కర్ణాటక
Published Thu, Jan 23 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement